- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి వేళ తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతు
సంక్రాంతి పండుగ వేళ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ సెలవులు కావడంతో కొండపోచమ్మ రిజర్వాయర్(Kondapochamma Reservoir)లో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వేళ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ సెలవులు కావడంతో కొండపోచమ్మ రిజర్వాయర్(Kondapochamma Reservoir)లో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతు అయిన వారిలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ధనుష్(20), సాయిలు(20), లక్కీ(17), దినేష్(17), జతిన్(17)లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం సిద్దిపేటలోని మర్కుక్ మండలం కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






