TG: కరీంనగర్‌లో దారుణం.. ఏడు నెలల గర్భవతి దారుణ హత్య

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-30 16:54:31  IST  )

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భవతి దారుణ హత్యకు గురైంది.

TG: కరీంనగర్‌లో దారుణం.. ఏడు నెలల గర్భవతి దారుణ హత్య
X

దిశ, ఇల్లందకుంట: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భవతి దారుణ హత్య(Pregnant Woman Murder)కు గురైంది. ఈ ఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా ఇల్లందకుంట(Ellantakunta) మండలం టేకుర్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టేకుర్తి గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. విభేదాలతో మొదటి భార్య రాములుకు దూరంగా ఉంటోంది. దీంతో రాములు రెండో భార్య తిరుమలమ్మతో కలిసి ఉంటున్నారు. శనివారం వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో మొదటి భార్య కొడుకు.. రాములు రెండో భార్య తిరుమలమ్మను గొంతు కోసి చంపాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story