భారీ వర్షాలు.. ల్యాండ్ స్లైడ్ కారణంగా ఏడుగురు మృతి.. పదుల సంఖ్యలో మిస్సింగ్

by Malleboina Mahesh |

పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు.. ల్యాండ్ స్లైడ్ కారణంగా ఏడుగురు మృతి.. పదుల సంఖ్యలో మిస్సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ (Darjeeling) జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు ఘోర అనర్థాన్ని మిగిల్చాయి. వివిధ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న ల్యాండ్ స్లైడ్‌ల (Land slides) కారణంగా ఏడుగురు మృతి చెందగా, పలువురు అదృశ్యమయ్యారు. ఇంకా అధికారికంగా మృతుల సంఖ్యను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణా పూర్తిగా స్తంభించింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (GTA) అన్ని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా అధికారులు ప్రజలు, పర్యాటకులు తప్పనిసరి పరిస్థితులు తప్ప బయటకు రాకూడదని సూచించారు.

దార్జిలింగ్–సిలిగురి మార్గం సహా పలు కీలక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుర్సియాంగ్ ప్రాంతంలోని దిలారామ్, విసిల్ ఖోలా వద్ద ప్రధాన రోడ్లు కొండచరియలతో పూర్తిగా మూసుకుపోయాయి. రోహిణి మార్గం కూడా తీవ్రంగా దెబ్బతింది. సిలిగురి, మిరిక్‌లకు కలుపు మార్గమైన దుధే ప్రాంతంలోని ఇనుప వంతెన కూలిపోయి పరిసర ప్రాంతాలు పూర్తిగా వేరుపడ్డాయి. అదే విధంగా పుల్బజార్ వంతెనకు కూడా తీవ్ర నష్టం వాటిల్లి, థనాలైన్, బీజాన్‌బారి వంటి ప్రాంతాలు దార్జిలింగ్‌తో రవాణా సంబంధాలు కోల్పోయాయి. అధికారులు రక్షణా చర్యలు వేగవంతం చేస్తుండగా, వర్షాలు ఆగకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

Next Story