కేరళలో ఏడుగురు బంగ్లాదేశీ మహిళల అరెస్ట్.. ఉగ్ర కుట్ర కోణంలో పోలీసుల దర్యాప్తు

by Kema Shiva Kumar |

కేరళలోని కార్యవట్టంలో ఏటీఎస్ (ATS) సమాచారంతో పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుగురు బంగ్లాదేశీ మహిళలు పట్టుబడ్డారు.

కేరళలో ఏడుగురు బంగ్లాదేశీ మహిళల అరెస్ట్.. ఉగ్ర కుట్ర కోణంలో పోలీసుల దర్యాప్తు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కార్యవట్టం (Karyavattom) ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీ మహిళలను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అందించిన రహస్య సమాచారం మేరకు స్థానిక పోలీసులు జరిపిన మెరుపు దాడిలో వారు పట్టుబడ్డారు. అక్రమ చొరబాట్లు, నివాసాలపై నిఘా ఉంచిన ఏటీఎస్ అధికారులకు, కార్యవట్టం పరిసరాల్లో కొందరు విదేశీయులు అనధికారికంగా ఉంటున్నట్లుగా సమాచారం అందింది. పక్కా మెసేజ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు కార్యవట్టంలోని ఓ అద్దె ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. సరైన వీసా, పాస్‌పోర్ట్ పత్రాలు లేని ఏడుగురు మహిళలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. వారంతా పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

గత కొంతకాలంగా వీరు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఇక్కడ నివసిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. విదేశీయుల చట్టం (Foreigners Act) కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వారి వెనుక ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఉందా.. మరేదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

Next Story