- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
పాత కక్షలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో అడపు మహేష్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు.

దిశ, వరంగల్ బ్యూరో : పాత కక్షలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో అడపు మహేష్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు. వరంగల్ కమిషనరేట్ లో డిసిపి అంకిత్ తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు.ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. నగరంలోని ఏనుమాముల ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన అడుపు మహేష్ (45) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. బాలాజీ నగర్‌కు చెందిన పత్తి కుమారస్వామి అలియాస్ కుమార్ గతంలో హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. మహేష్ తనపై తప్పుడు ప్రచారం చేస్తూ స్థానిక ప్రజా ప్రతినిధి వద్ద రాజకీయంగా తన ప్రాధాన్యతను దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో కుమార్ కక్ష పెంచుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ క్రమంలో మహేష్‌ను హత్య చేయాలని కుమార్ తన అనుచరులు గంధం నరేష్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్, లాసాని రామ్‌సాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్, సురేష్‌లతో కలిసి పథకం రచించాడని తెలిపారు. ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్ నంబర్-2 వద్ద మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ మరుసటి రోజు రాత్రి మృతి చెందాడన్నారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని అన్నారు. సి ఐ విశ్వేశ్వర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు వేగంగా విచారణ చేపట్టి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాయన్నారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలింపు కొనసాగుతోందని సీపీ తెలిపారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసును వేగంగా ఛేదించిన మామునూరు ఏసీపీ వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్‌తో పాటు గీసుగొండ సిఐ విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ మరియు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.






