ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

by Kema Shiva Kumar |

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A1 నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఇవాళ కాకినాడలోని మొబైల్‌ కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభపెట్టడంపై ప్రశ్నించారు. ఈ మేరకు ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ అనంతబాబుకు14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రాజమండ్రి కోర్టు ఆవరణలో అనంతబాబును పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story