తెలంగాణలో ఘోర ప్రమాదం.. 30 మందికి గాయాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-04 03:31:18  IST  )

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

తెలంగాణలో ఘోర ప్రమాదం.. 30 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం(Maheshwaram) మండలం తుమ్మలూరులో ఆర్టీసీ బస్సు, ట్రావెల్స్‌ బస్సు ఢీ(Bus Accident) కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యానని వెల్లడించారు. రెండు బస్సుల్లో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story