- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చోరీలే కెరీర్.. లూడో, లవ్, లూటీ - సునీల్ శెట్టి ఫ్యాన్ రియల్ లైఫ్ రౌడీ..!
వందకు పైగా చోరీలు చేసి ఇంకా తీరు మార్చుకోకుండా మళ్ళీ.. మళ్ళీ చోరీలు చేస్తున్న పేరుమోసిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టిని హైదరాబాద్ బండ్లగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

దిశ, సిటీక్రైం : వందకు పైగా చోరీలు చేసి ఇంకా తీరు మార్చుకోకుండా మళ్ళీ.. మళ్ళీ చోరీలు చేస్తున్న పేరుమోసిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టిని హైదరాబాద్ బండ్లగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని నుంచి 35 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహ్మాద్ సలీమ్ 1991 సంవత్సరం నుంచి చోరీలను మొదలు పెట్టాడు. ఇప్పటికీ దొంగతనాల్లో సెంచరీ దాటేశాడు. . 25 సార్లు జైలు కు వెళ్ళొచ్చాడు. అతని మీద సీడీసీ షీట్ కూడా ఉంది. అయినా మారలేదు. తాజాగా మే నెలలో జైలు నుంచి విడుదలయ్యి బండ్లగూడ ప్రాంతంలో రెండు ఇండ్లలలో చోరీలకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అతనిని గురువారం అరెస్టు చేశారు.
ఉదయం 4 గంటల తర్వాతనే సలీమ్ చోరీలకు లక్కీ టైం
మహ్మద్ సలీమ్ హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయణ గుట్ట, ఫలుక్ నుమా, కాలాపత్తర్, కామాటిపుర, హూస్సేనిఆలం, కంచన్ బాగ్, సంతోష్ నగర్, బాలాపూర్ , పహాడిషరీఫ్ మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ ప్రాంతాలలోనే చోరీలు చేస్తాడు. అది కూడా తెలవారు జామును 4 గంటల ప్రాంతంలోనే ఓ చిన్న టార్చ్ లైట్ తో బయలు దేరుతాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఇండ్లను మాత్రమే ఎంచుకుని చోరీలు చేస్తాడు. చోరీకు ముందు మొబైల్ ఫోన్ లో లూడో, క్రికేట్ గేమ్ లను ఆడి ఆ తర్వాత దొంగతనాల కోసం తాళం ఉన్న ఇండ్లను వెతుకుంటాడు. ఈ ప్రాంతాలలో చాలా వరకు ఇండ్లకు కిటికిలు, వెంటిలేటర్ ల పైన కొంత గ్యాప్ ఉంటుంది. అలాంటి ఇండ్లను ఎంచుకుని ఆ గ్యాప్ లో నుంచి దూరి ఇంట్లోకి ప్రవేశించి. ఒక చిన్న చెంచా దొరికినా సరే దాంతోనే అల్మారా లను తెరిచి చోరీలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. లక్కీ టైం 4 గంటలు ఎందుకని పోలీసులు ఆరా తీస్తే పాత బస్తీలో దాదాపు తెలవారుజ జాము 3 గంటల వరకు అందరూ మెలుకువగా ఉంటారని 4 తర్వాత నిద్రపోతారని సలీమ్ పోలీసులు వివరించాడు.
ఈ దొంగకు ఓ లవ్ స్టోరీ
మహ్మద్ సలీమ్ తన 16 సంంత్సరాల వయస్సులోనే ప్రమేలో పడ్డాడు. ఆమె తో కలిసి విలాసతవంతంగా తిరగాడానికి మొదట తన ఇంట్లో ఉండే కిరాణా దుకాణంలో చోరీలు చేశాడు. ఇంట్లో వారికి తెలియడంతో పారిపోయాడు. అలా తన లవర్ తో జల్సా చేసేందుకు చోరీల బాట పట్టి మొదటిసారిగా 18వ సంవత్సరంలో పోలీసులకు దొరికాడు. జైలు స్నేహంతో ఇండ్లలో చోరీలకు అలవాటు పడ్డాడు..
హెలికాప్టర్ లో షికారు
మహ్మద్ సలీమ్ చోరీ చేసిన డబ్బుతో ముంబాయిలో అత్యంత విలాసవంతంగా ఖర్చు చేస్తాడు. అదే విధంగా విహార యాత్ర స్పాట్ లకు వెళ్ళి హెలికాప్టర్ లలో షికారు చేస్తాడు. ఖరీదైన హోటల్ లలో కాల్ గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తాడు. అలా వెచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు. అదే కాకుండా ఈ మహ్మద్ సలీమ్ కు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అంటే చాలా అభిమానం. దీంతో అతను చోరీలు చేసినప్పుడల్లా తన పేను సునీల్ శెట్టి అని చెప్పుకుంటాడని పోలీసులు చెప్పారు. అదే విధంగా ముంబాయికి వెళ్ళినప్పుడల్లా సునీల్ శెట్టి ని కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు వివరించారు. ఇలా ఈ దొంగ మహ్మద్ సలీమ్ తన బుద్ధిని మార్చుకోక ఇంకా చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.






