సీరియల్‌ హీరోయిన్‌ను చేస్తా.. 300 మంది అమ్మాయిల ట్రాప్.. అత్యాచారం.. ఇంజినీర్ అరెస్ట్

by Sujitha Rachapalli |

రాజస్థాన్ కోటాలో దాదాపు 300 మంది అమ్మాయిలను మోసం చేశాడు ఓ ఇంజినీర్. సీరియల్‌ హీరోయిన్‌ ఆఫర్ అంటూ లక్షల్లో సంపాదించాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా యాడ్స్ ఇస్తూ.. హామీలు ఇస్తూ.. డబ్బులు వసూల్ చేశవాడు. అంతకు ముందు అత్యాచారం

సీరియల్‌ హీరోయిన్‌ను చేస్తా.. 300 మంది అమ్మాయిల ట్రాప్.. అత్యాచారం.. ఇంజినీర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ కోటాలో దాదాపు 300 మంది అమ్మాయిలను మోసం చేశాడు ఓ ఇంజినీర్. సీరియల్‌ హీరోయిన్‌ ఆఫర్ అంటూ లక్షల్లో సంపాదించాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా యాడ్స్ ఇస్తూ.. హామీలు ఇస్తూ.. డబ్బులు వసూల్ చేశవాడు. అంతకు ముందు అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన దుండగుడి కోసం చాలా కాలంగా వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

కోటా జిల్లా ఝార్గావ్‌కు చెందిన దీపక్ మీనా తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కాగా దీపక్ భరత్ పూర్‌లో బీటెక్ చేశాడు. ఆ తర్వాత చదువుల కోసం ముంబై వెళ్లాడు. మోడలింగ్, టీవీ ప్రపంచానికి ఆకర్షితుడయ్యాడు. ఓ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా చేరాడు. దాదాపు నాలుగేళ్లు అందులో పని చేసిన దీపక్‌కు సీరియల్ ఆఫర్స్ కోసం వెతికే అమ్మాయిలు ఎక్కువే ఉంటారని గ్రహించాడు. ఈజీగా మోసం చేయొచ్చని.. ఈజీ మనీ సంపాదించొచ్చని నిశ్చయించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అవకాశం కోసం పది నుంచి పదిహేను వేలు డిమాండ్ చేసి.. మనీ ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేస్తాడు. మొత్తానికి కొందరు అమ్మాయిలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.

Next Story