- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్య.. ఎట్టకేలకు నోరువిప్పిన ‘ఐబొమ్మ’ రవి
హమ్మయ్య.. ఎట్టకేలకు నోరువిప్పిన ‘ఐబొమ్మ’ రవి

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి కేసు(Ibomma Ravi Case)లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం నాటి విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. హెచ్‌డీ సినిమాల పైరసీపై నోరువిప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి.. హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డు చేసినట్లు తెలిపాడు. పైరసీకి హెచ్‌డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి.. అందులో పైరసీ లింక్ అప్‌లోడ్ చేసి.. 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్-3, కిష్కిందపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు.
కాగా, ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మూడు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కేసులో నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. కోర్టు అనుమతి మేరకు ఈరోజు (గురువారం) చంచల్‌గూడా జైలు నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.






