చిచ్చురేపిన వీడియో రికార్డింగ్.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-16 07:21:34  IST  )

ఓ వీడియో రికార్డింగ్ విషయంలో విద్యార్థినిని, ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన బాపట్ల (Bapatla) జిల్లా కర్లపాలెం (Katlapalem) మండల పరిధిలోని చింతాయపాలెం (Chinthayapalem)లో హైస్కూ్ల్లో ఇవాళ చోటుచేసుకుంది.

చిచ్చురేపిన వీడియో రికార్డింగ్.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వీడియో రికార్డింగ్ విషయంలో విద్యార్థినిని, ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన బాపట్ల (Bapatla) జిల్లా కర్లపాలెం (Katlapalem) మండల పరిధిలోని చింతాయపాలెం (Chinthayapalem)లో హైస్కూ్ల్లో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పోర్ట్స్ యూనిఫామ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఇటీవలే మస్తాన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఇవాళ పాఠశాలలో అదే విషయంపై విద్యార్థినితో పాటు ఆమె తల్లి, టీచర్ మస్తాన్ రెడ్డి, పీఈడీ గోపీ స్పోర్ట్స్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే పీఈడీ గోపీని స్పోర్ట్స్ కమిటీ సభ్యులు విచారిస్తుండగా.. సస్పెండ్ అయిన మస్తాన్ రెడ్డి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అది చూసిన విద్యార్థిని వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మస్తాన్ రెడ్డి ఉన్నట్టుండి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. కూతురిపై దాడి చేస్తుండటం చూసి ఆగ్రహించి విద్యార్థిని ఆమె తల్లి, మస్తాన్ రెడ్డిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఆ ఉపాధ్యాయుడు ఇద్దరి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. పరస్పర ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story