- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాఫ్ట్‌వేర్ సునీత హత్య.. వెలుగులోకి భయంకర నిజాలు
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సునీత హత్య కేసులో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారుప్రాంతమైన వనస్థలిపురంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సునీతను ఆమె మాజీ భర్త అతి దారుణంగా చంపడం రాష్ర్టంలో కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె హత్య యాదృచ్ఛికం కాదని, 60 రోజుల రెక్కీ తర్వాత.. పక్కా ప్లాన్ తోనే మహేశ్ ఆమెపై దాడి చేసి, కట్టర్ మెషీన్ తో కిరాతకంగా చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మహేశ్ కెనడాలో ఉద్యోగం చేసేవాడు. సునీత అతనిపై, అతని తల్లిపై పెట్టిన కేసుల కారణంగా తిరిగి వెళ్లలేక పోవడంతో ఉద్యోగం పోయింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెంచాడు. ఇటీవల ఆమె ఒక ఆలయం వద్ద తీసుకున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో.. దానిని బట్టి ఆమె వనస్థలిపురంలోని కాప్రాయిచెరువు సమీపంలో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు.
ఎలాగైనా సునీతను చంపాలని నిర్ణయించుకున్న మహేశ్.. తన వెంట గ్రైండర్ కట్టర్, పెప్పర్ స్ర్పే, పదునైన కత్తుల్ని తీసుకెళ్లాడు. సునీతను హతమార్చాక.. అతను సూసైడ్ చేసుకునేందుకు పెట్రోల్ కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తుర్కయాంజిల్లోని ఓ హాస్టల్లో ఉన్న మహేశ్.. 60 రోజులపాటు రెక్కీ చేసి.. వాచ్ మన్ లేని సమయంలో అపార్టుమెంట్లోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. పైగా.. దీనిపై తనకు ఎలాంటి చింతా లేదని, ఏ శిక్షకైనా రెడీగా ఉన్నట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. సునీత రెండో భర్త శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహేశ్ ను రిమాండ్ కు తరలించారు.






