- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుని మైనర్ బాలిక అత్యాచారం కేసులో తెరపైకి సంచలన విషయాలు
కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. 8వ తరగతి బాలికపై నారాయణరావు అనే 61 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నారాయణరావు బుకాయించినా పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. 8వ తరగతి బాలికపై నారాయణరావు అనే 61 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నారాయణరావు బుకాయించినా పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి తరవాత అతడిని కోర్టుకు తీసుకెళుతుండగా కోమటిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ ఈతగాళ్లసాయంతో డెడ్ బాడీని పోలీసులు బయటకు తీశారు. కాగా ఈ కేసులో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. నింధితుడు నారాయణరావు బాలికను స్కూల్ నుండి 5సార్లు బయటకు తీసుకువెళ్లినట్టు గుర్తించారు. ఐదు సార్లు బయటకు తీసుకునివెళ్లగా మూడుసార్లు అత్యాచారం జరిగినట్టు నిర్దారించారు. బాలికకు తాతను అవుతానని స్కూల్‌లో సిబ్బందికి చెప్పిన నారాయణరావు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.






