- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. నా భర్తను చంపే బాధ్యత నీదే’: సంచలన ఆడియో లీక్
నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకున్న యువకుడి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకున్న యువకుడి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన సహచరులతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గల్ఫ్ నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రశాం తన్ను, న్యాల్కల్‌కు చెందిన వెంకటసాయి అలియాస్ బంటి మద్యం సేవించేందుకు తీసుకెళ్లాడు. అనంతరం ప్రశాంత్ భార్య సంధ్య, బంటి కలిసి అతడిని అపస్మారక స్థితికి చేర్చి, తర్వాత ఆసుపత్రికి తరలించినట్టు నమ్మించి, ప్రైవేటు ఆసుపత్రిలో టాయిలెట్ క్లీనర్ ఆర్పిక్ లిక్విడ్‌ను శరీరంలోకి ఎక్కించి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండగా, అదే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు సంధ్య, అనిల్, వెంకటసాయి అలియాస్ బంటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తాజాగా ఈ హత్యకు ముందు సంధ్య, ఆమె ప్రియుడి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. “వాడు తాగేసి ఉన్నాడు.. ఏం చేస్తావో నాకు తెలియదు, కింద పడేయాల్సిందే.. వాడు కిందికి దిగొద్దు" అంటూ సంధ్య తన ప్రియుడితో మాట్లాడిన మాటలు, ఆపై భర్త కాలు గుంజి కింద పడేసినట్లు ప్రియుడు అంగీకరించిన వివరాలు ఈ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి ఒడిగట్టేందుకు సంధ్య తన ప్రియుడికి డబ్బులు కూడా ఆశ చూపినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు సంధ్యతో పాటు ఆమె ప్రియుడినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






