- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: వేరే వ్యక్తుల వీర్యం పెద్ద ఎత్తున్న నిల్వ.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు
సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Test Tube Baby Center)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Test Tube Baby Center)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం పోలీసుల తనిఖీల్లో ఇది వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తన భర్త వీర్య(Sperm) కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే.. వేరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన డీఎన్‌ఏ టెస్టు(DNA Test) చేయించుకోగా, శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలింది. దీంతో వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.






