- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్.. క్రూరంగా హత్య..
ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు.. ఆమెను క్రూరంగా హతమార్చారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు.. ఆమెను క్రూరంగా హతమార్చారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు భూపేంద్రకు కాల్ చేశాడు. ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కిన ఇద్దరు.. అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. శవాన్ని కాలువలో పడేశారు.
కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు ఫైల్ చేయడంతో.. విచారించగా ఆమె మృతదేహం కాలువలో లభ్యమైంది. నిందితులు రాజు వర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. రేప్ జరిగిందని, గొంతు బిగించి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో కన్ఫర్మ్ అయిందని చెప్పారు.






