- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాల ప్రధానోపాధ్యాయుడి హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భరౌలీ పొలిటికల్ కాంపోజిట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర యాదవ్, సహోపధ్యాయురాలు కంచన్ సింగ్ బైక్‌పై వెళ్తుండగా.. ముగ్గురు మాస్క్ దొంగలు ఎటాక్ చేశారు. స్కూల్ నుంచి బిల్థరారోడ్‌లోని

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భరౌలీ పొలిటికల్ కాంపోజిట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర యాదవ్, సహోపధ్యాయురాలు కంచన్ సింగ్ బైక్‌పై వెళ్తుండగా.. ముగ్గురు మాస్క్ దొంగలు ఎటాక్ చేశారు. స్కూల్ నుంచి బిల్థరారోడ్‌లోని యాదవ్ నగర్‌కు తిరిగొస్తుండగా.. సాహున్‌పూర్ విలేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరిపై ఎటాక్ చేసిన దుండగులు బంగారు గొలుసు లాక్కోవడంతో.. దేవేంద్ర యాదవ్ వ్యతిరేకించాడు. దీంతో దొంగలు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో హెల్మెట్ నుంచి దూసుకుళ్లిన బుల్లెట్‌తో తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. కంచన్ సింగ్‌కు కూడా గాయాలు కాగా.. ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు దేవేంద్రను వారణాసికి రిఫర్ చేయగా.. మార్గమధ్యంలోనే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. భద్రతా వ్యవస్థ విఫలమైందని.. ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






