- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొన్న ఢిల్లీ నేడు మహారాష్ట్ర.. ఆందోళనకరంగా స్కూల్ విద్యార్థుల ఆత్మహత్యలు!
ఇటీవల ఢిల్లీలో స్కూల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది. సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఢిల్లీలో స్కూల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది. సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం... జల్నా నగరంలోని సీటీఎంకే గుజరాతీ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న ఆరోహి దీపక్ బిట్లాన్ అనే విద్యార్థిని రోజూ మాధిరిగానే శుక్రవారం స్కూలుకు వెళ్లింది. కాగా ఉదయం 7.30 గంటలకే స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే స్కూల్ యాజమాన్యం విద్యార్థిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చిత్రహింసలు, వేధింపుల వల్లనే తమ కుమార్తె మరణించారని ఆరోపించారు. చాలా రోజుల నుండి తమ కూతురు ఆవేదన చెందుతోందని కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని చెప్పారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు గురి చేసిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే సాధారణంగా టీనేజీ లేదా యుక్తవయసు వారు ఆత్మహత్య చేసుకోవడం సహజమే. ఆర్థిక కారణాలో, కుటుంబ కలహాలో, ప్రేమ విఫలం అవ్వడమో ఇలా అనేక కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ స్కూల్ విద్యార్థులకు అలాంటి సమస్యలేమీ ఉండవు. ఆత్మహత్యకు పాల్పడే అంత ధైర్యం కూడా ఉండదు. కాబట్టి స్కూల్ విద్యార్థుల ఆత్మహత్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పాఠశాలల్లో అసలేం జరుగుతోంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వాలు, చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






