శంషాబాద్‌లో బోల్తాపడిన స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-25 06:06:50  IST  )

స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది.

శంషాబాద్‌లో బోల్తాపడిన స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ (Shamshabad)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ పండుగల వేళ రిషి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు స్కూలు బస్సులో హైదరాబాద్‌ (Hyderabad)లోని జలవిహార్‌ (Jala Vihar)కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టగా శంషాబాద్ సిగ్నల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయలైనట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Related News : ఘోర బస్సు ప్రమాదం.. తృటిలో తప్పించుకొన్న 42 మంది చిన్నారులు

Next Story