- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మెడికల్ షాపు నిర్వాహకులకు హెచ్చరిక
తెలంగాణ మెడికల్ షాపు నిర్వాహకులకు హెచ్చరిక

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే విక్రయించే షెడ్యూల్-హెచ్ డ్రగ్స్‌ను నేరుగా రోగులకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్న మెడికల్ షాపులపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) దాడులు చేసింది. షెడ్యూల్-హెచ్ డ్రగ్స్ గా పరిగణించే హయ్యర్ జనరేషన్ యాంటీబయాటిక్స్, హాబిట్-ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయంపై దృష్టి సారించారు. చాలా మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా డీసీఏ గుర్తించింది. సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఇల్లీగల్‌గా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయిస్తున్న 196 రిటైల్ మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాడుల్లో షెడ్యూల్- హెచ్ రిజిస్టర్ నిర్వహణ, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అమ్మకం, సేల్స్ బిల్లులు- పర్చేజ్ బిల్లుల నిర్వహణ, తాజా జీఎస్టీ స్లాబ్‌ల ప్రకారం మందుల అమ్మకంపై కూడా తనిఖీలు చేపట్టారు. షోకాజ్ నోటీసులు అందుకున్న షాపులకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940, సంబంధిత నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీఏ డీజీ షానవాజ్ ఖాసిం స్పష్టం చేశారు.






