ఎక్స్‌లో న్యూడ్ వీడియోలు, న్యూడ్ వీడియో కాల్.. రూ.3.80 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు

by Naga Rani Yarlagadda |

ఎక్స్ లో న్యూడ్ వీడియోలు రావడంతో ఓ వ్యక్తి వారి వలలో చిక్కుకున్నాడు.

ఎక్స్‌లో న్యూడ్ వీడియోలు, న్యూడ్ వీడియో కాల్.. రూ.3.80 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. మళ్లీ మళ్లీ అదే ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో హనీ ట్రాప్ లో పడి బాధితుడు రూ.3.8 కోట్లు పోగొట్టుకున్నాడు. అమ్మాయి పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి న్యూడ్ వీడియోలు వస్తుండటంతో.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అకౌంట్ నుంచి మహిళే వీడియో కాల్ మాట్లాడటంతో అంతా నిజమేనని భావించాడు. ఆపై స్థలాలు, పొలాలు అమ్ముతామని ఓ వ్యక్తిని నమ్మించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు కొల్లగొట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్స్ లో న్యూడ్ వీడియోలు రావడంతో ఓ వ్యక్తి వారి వలలో చిక్కుకున్నాడు. సంయుక్త రెడ్డి అనే పేరుతో తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరీ, ఫ్రెండ్ మొల్లం మల్లిక అలియాస్ లిల్లీలు అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ నుంచి కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తికి తరచూ న్యూడ్ వీడియోలు పంపుతూ తమ వలలో వేసుకున్నారు. మధ్యలో ఒక మహిళ న్యూడ్ వీడియో కాల్ కూడా మాట్లాడటంతో పూర్తిగా వారి మాయలో పడిన బాధితుడు.. పొలాలు, స్థలాలు అమ్ముతామని చెప్పగా.. వారెంత అడిగితే అంత అమౌంట్ ను ఆన్లైన్లో బదిలీ చేశాడు. ఒకరోజు తనకు అమ్మిన స్థలాలు, పొలాలు ఎక్కడో చూపించాలని అడగడంతో ప్లాన్ బెడిసికొట్టింది. బాధితుడికి అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించగా.. అసలు విషయం బయటపడింది. డిగ్రీ చదివిన వారంతా.. ఈజీ మనీ కోసం అలవాటు పడి అనేక అడ్డదారులు తొక్కినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

కొల్లగొట్టిన సొమ్ము రూ.3.80 కోట్లలో రూ.41.26 లక్షలతో రెండు కార్లు, ఒక బైక్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగతా రూ.3.38 కోట్లను తమ జల్సాలు, ఇతర అవసరాలకు ఖర్చు చేశామని చెప్పడంతో అది విన్న పోలీసులు అవాక్కయ్యారు. స్కామర్లను నమ్మి తాను రూ.3.80 కోట్లు నష్టపోయానంటూ బాధితుడు వాపోతున్నాడు. ఇకనైనా ఆన్లైన్లో వచ్చే మెసేజులు, వీడియోలను నమ్మి వారి ట్రాప్ లో పడవద్దని పోలీసులు సూచించారు.

Next Story