సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సరెండర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-08 05:23:56  IST  )

సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కీలక అనుచరుడు కొమ్మా కోట్లు (Komma Kotlu) ఇవాళ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A2 నిందితుడిగా ఉన్న కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కోట్లు అజ్ఞాతంలో ఉండగా.. ఇటీవల పక్కా సమాచారంతో అతడు ఉంటున్న ప్రదేశాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. కొమ్మా కోట్లు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు.

కాగా, ఇదే సమయంలో గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం రెండు కేసుల్లో అతడి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు ఇవాళ కోట్లుపై అధికారికంగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసి కేసు వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్‌ను బెదిరించడం, కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ జైలు పాలై అనారోగ్యంతో జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇటీవల నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ కోర్టులో లొంగిపోగా.. మరో నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.

Next Story