నీ పని అవుట్, క్షుద్ర‌పూజ‌లు చేయిస్తా..సంధ్య శ్రీధర్ రావు ఆడియో వైర‌ల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-22 12:24:29  IST  )

సంధ్య కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

నీ పని అవుట్, క్షుద్ర‌పూజ‌లు చేయిస్తా..సంధ్య శ్రీధర్ రావు ఆడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: సంధ్య కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ అవుతోంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్‌కు క్షుద్రపూజలు చేసి ఖతం చేసినట్టుగా నిన్ను కూడా ఖతం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పదిహేను రోజుల్లో నీ డౌన్ ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతావని హెచ్చరించారు.

నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత నీ భార్య వారం రోజుల్లో విదవరాలు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఆడియోలో శ్రీధర్ రావు బూతులు తిట్టారు. శ్రీధర్ రావు బెదింరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు కేఎన్ రెడ్డి అని తెలుస్తోంది. ఆయనతో శ్రీధర్ రావు కోటి రూపాయల వరకు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వమని అడిగిందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీధర్ రావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారని గత బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.13 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఆయనకు పోలీసులు, రాజకీయనాయకులతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతమంది ఆయనపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

Next Story