Saipriya case : దారుణ హత్యకు గురైన సాయిప్రియ.. దానికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడు ఘాతుకం

by Satheesh |   (  Updated:2022-09-10 13:36:29  IST  )

రాజేంద్ర నగర్‌లో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన Saipriya అనే యువతి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది.

Saipriya case : దారుణ హత్యకు గురైన సాయిప్రియ.. దానికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడు ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజేంద్ర నగర్‌లో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ప్రియుడు శ్రీశైలం సాయిప్రియను దారుణంగా హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రీశైలం సాయిప్రియను ఒత్తిడి చేశాడు. ఇందుకు యువతి నిరాకరించడంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. సాయిప్రియ హత్యకు శ్రీశైలానికి మరో వ్యక్తి సహకారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, నాలుగు రోజుల క్రితం సాయిప్రియ రాజేంద్ర నగర్‌లో అదృశ్యం కాగా.. నేడు వనపర్తి జిల్లాలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : మహిళల లోదుస్తులే అతడి టార్గెట్.. ఏం చేస్తున్నాడో చూడండి (వీడియో)

Next Story