హైదరాబాద్ వాసికి నకరం చూపిస్తున్న రష్యా ఆర్మీ.. ఇండియాకు రప్పించాలంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-17 08:28:36  IST  )

ఏజెంట్ మాటలు నమ్మి రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసిని అక్కడి ఆర్మీ టార్చర్ చేస్తోంది. దీంతో తన భర్తను తిరిగి ఇండియాకు తీసుకునిరావలంటూ బాధితుడి భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఖైర‌తాబాద్‌కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ అహ్మద్ (37) అనే వ్య‌క్తిని ర‌ష్యాలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి ఓ ఏజెంట్ ఏప్రిల్ 25న ఆ దేశానికి పంపించాడు.

హైదరాబాద్ వాసికి నకరం చూపిస్తున్న రష్యా ఆర్మీ.. ఇండియాకు రప్పించాలంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏజెంట్ మాటలు నమ్మి రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసిని అక్కడి ఆర్మీ టార్చర్ చేస్తోంది. దీంతో తన భర్తను తిరిగి ఇండియాకు తీసుకునిరావలంటూ బాధితుడి భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఖైర‌తాబాద్‌కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ అహ్మద్ (37) అనే వ్య‌క్తిని ర‌ష్యాలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి ఓ ఏజెంట్ ఏప్రిల్ 25న ఆ దేశానికి పంపించాడు. ఉద్యోగం ఆశ‌తో అహ్మ‌ద్ వెళ్లగా అక్క‌డ‌కు వెళ్లిన త‌ర‌వాత బ‌లవంతంగా అత‌డిని ర‌ష్యా ఆర్మీ యుద్ధంలోని పంపింద‌ని సెల్ఫీ వీడియోలో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

త‌ప్పించుకునే క్ర‌మంలో త‌న కాలు కూడా విరిగిపోయింద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. న‌డ‌వ‌లేక‌పోతున్నాన‌ని తానేమీ చేయ‌లేని స్థితిలో ఉన్నాన‌ని చెప్పాడు. త‌న‌తో పాటు ర‌ష్యాకు వెళ్లిన 30 మందిలో 17 మంది మ‌ర‌ణించార‌ని తెలిపాడు. యుద్ధం చేయ‌క‌పోతే ర‌ష్యా ఆర్మీ చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతుందోని చెప్పాడు. ప్ర‌స్తుతం తాను బార్డ‌ర్ లో ఉన్నాన‌ని అత‌డు సెల్ఫీ వీడియో విడుద‌ల చేశాడు. ప్ర‌స్తుతం యుద్ధం జ‌రుగుతోందని మ‌ర‌ణించిన వారిలో ఓ భార‌తీయుడు కూడా ఉన్నాడ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం న‌లుగురు భార‌తీయులం ఉన్నామ‌ని యుద్ధానికి వెళ్ల‌మ‌ని చెబితే తుపాకీ పెట్టి కాలుస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని చెప్పాడు. ఏజెంట్ ను మాత్రం వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌ని, ర‌ష్యాకు తీసుకువ‌చ్చి త‌న‌ను 50 రోజులు ఖాళీగా ఉంచాడ‌ని తెలిపాడు. త‌ర‌వాత రెండు ఉద్యోగాలు చూపించినా అక్క‌డ డ‌బ్బులు ఎగ్గొట్టార‌ని చెప్పాడు. చివ‌రికి ఓ వ్య‌క్తి తీసుకువ‌చ్చి త‌న‌ను ఆర్మీలో చేర్పించాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాను జీవితంలో చేసిన త‌ప్పు ఇదేనని కుటుంబం త‌న‌ను క్ష‌మించాల‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. video

Next Story