- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్తో అక్రమ సంబంధం అంటూ పుకార్లు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య
ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందంటూ తోటి విద్యార్థులు వ్యాప్తి చేసిన పుకార్లతో మనస్తాపం చెందిన వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రొఫెసర్‍తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు వ్యాప్తి చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో ఉన్న రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చివరి సంవత్సరం చదువుతున్న నిఖిత (22) నిన్న తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని తండ్రి, కాలేజీ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ జీఎన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. నిఖిత తన కళాశాలలోని డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో తన చదువు విషయంలో ఆయనతో చొరవగా మాట్లాడేది. అయితే నిఖిత క్లాస్ మేట్స్ కొందరు నిఖితకు, సదరు లెక్చరర్‍కు మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించి వాటిని వ్యాప్తి చేశారు.
తల్లిదండ్రులు సర్ధిచెప్పినా:
తప్పుడు ప్రచారం చేయడంతోనే ఆగకుండా పదే పదే తన కూతురని ఆమె క్లాస్‍మేట్స్ అవమానపరిచేలా మాట్లాడారని నిఖిత తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారించాలని తాము తమ కూతురుకు ధైర్యం చెప్పామని అయినా తోటి విద్యార్థులు వేధింపులు ఆపకపోవడంతో మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తన కూతురు గదిలో ఆత్మహత్య లేఖ లభించిందని ఇందులో తన కుమార్తె మరణానికి కారణమని ఆరోపిస్తున్న సహవిద్యార్థుల పేర్లను పేర్కొందని తెలిపరు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.






