- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆర్‌టీసి ఉద్యోగి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్టీసి ఉద్యోగి మృతి చెందిన సంఘటన గుండు మాల్ మండల కేంద్ర సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, కొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్టీసి ఉద్యోగి మృతి చెందిన సంఘటన గుండు మాల్ మండల కేంద్ర సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. నారాయణ పేట జిల్లా కొత్తపల్లి తాండాకు చెందిన అర్‌టిసి ఉద్యోగి వాసురాం (46) కోస్గి బస్ డిపోలో కండక్టరుగా విధులు నిర్వహించే వారు. విధులు ముగించుకుని తన సొంతూరు కొత్త పల్లి తాండాకు ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న క్రమంలో గుండు మాల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకుని కోస్గి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తి మృతి చెందడంతో తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






