హారన్ కొట్టాడని RTC డ్రైవర్‌పై దాడి..

by Gantepaka Srikanth |

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌పై పలువురు అత్యంత కిరాతకంగా దాడి చేశారు.

హారన్ కొట్టాడని RTC డ్రైవర్‌పై దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌పై పలువురు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. అడ్డొ్చ్చిన మహిళా కండక్టర్‌పైనా చేయి చేసుకున్నారు. అంతేకాదు.. వద్దని వారించిన ప్రయాణికులనూ దూషించారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు కండక్టర్ గీతాంజలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె సెల్‌ఫోన్ సైతం పూర్తిగా ధ్వంసం అయింది. ప్రయాణికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ధర్మవరం నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story