కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగిన కండక్టర్ మృతి

by Bhanu |

ఎర్రబెల్లి గూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక పురుగుల మందు సేవించిన ఓ .

కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగిన కండక్టర్ మృతి
X

దిశ, నెల్లికుదురు : ఎర్రబెల్లి గూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక పురుగుల మందు సేవించిన ఓ ఆర్టీసీ కండక్టర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు బిట్ల రమేష్ (40), ఆర్టీసీ తొర్రూరు డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. రమేష్ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ నెల 6న తల్లిని చూడటానికి స్వగ్రామమైన ఎర్రబెల్లి గూడెం వచ్చిన రమేష్, సాయంత్రం తీవ్రమైన నొప్పి రావడంతో ఆవేశంలో ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. దీంతో వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యులు తొర్రూరుకు, అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story