- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడకమళ్లలో నైట్ హాల్ట్ బస్సు దగ్ధం.. గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య..!
by Bhanu |
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసి బస్సు దగ్దమైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ , మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసి బస్సు దగ్దమైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మిర్యాలగూడ డిపో కు చెందిన ఆర్టీసి బస్సు తడకమళ్లకు నైట్ హల్ట్ వెళ్లింది. అయితే కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో నిప్పు అంటించి తగలపెట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా తగలబడి నష్టం జరిగింది. సమాచారం తెలుసుకున్న మిర్యాలగూడ సి ఐ పి.ఎన్.డి ప్రసాద్, ఎస్ ఐ లక్ష్మయ్య లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






