- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం..
by Taduka Kalyani |
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో షాదాన్ కళాశాల సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.

X
దిశ, గండిపేట్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో షాదాన్ కళాశాల సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వాహనాలను ఢీకొంటూ బస్సు దూసుకెళ్లింది. కాగా ఈ ఘటనలో ముగ్గురు విలేకరులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనను గమనించి ప్రాణాలు దక్కించుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు. బస్సు డ్రైవర్ పై స్థానికులు దాడికి దిగగా వారిని పోలీసులు సముదాయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
Next Story






