పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |

ఆర్టీసీ బస్సు (RTC Bus) పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇవాళ రాత్రి 7.30 ప్రాంతంలో చోటుచేసుకుంది.

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సు (RTC Bus) పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇవాళ రాత్రి 7.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ (Adilabad) పట్టణం నుంచి కరంజి (Karanji)కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ ఉన్నట్టుండి బ్లాస్ట్ అయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోగా.. బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story