- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్: విద్యుత్ తీగలు తగిలి దగ్ధమైన ఆర్టీసీ బస్సు
by Gantepaka Srikanth |
వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు రాగానే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






