ఆర్టీసీ బస్సు ఢీ.. మేకప్ మ్యాన్ మృతి

by Bhanu |

ఆర్టీసీ బస్ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీ.. మేకప్ మ్యాన్ మృతి
X

దిశ, జూబ్లీహిల్స్: ఆర్టీసీ బస్ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన అశ్విని వేణు గోపాల్ (46), భార్య అశ్వినీ, కుమార్తెతో కలిసి చిత్రపురి కాలనీలో నివసిస్తుంటారు. వేణు గోపాల్ సినిమా నటులకు మేకప్ మ్యాన్ గా పని చేస్తాడు. అతను ఇంటి వద్ద నుండి శుక్రవారం సాయంత్రం కృష్ణ నగర్ , ఎల్.ఎన్ నగర్ వద్ద జరిగే జనరల్ మేకప్ యూనియన్ సమావేశానికి వెళ్ళాడు.

తరువాత రోజు మధ్యాహ్నం ఇంటికి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా వెనుక నుండి ఆర్టీసీ బస్ ఢీ కొనటంతో వేణు గోపాల్ తలకు బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు.

Next Story