బెంగుళూరులో ATM వాహనంలో రూ.7 కోట్లు చోరీ.. నిందితుల్లో మాజీ సైనికుల కుమారులు

by Ajay Maddhiboyina |

ఈ నెల 19న బెంగుళూరులో ఏటీఎం చోరీకి గురైంది. సినిమా రేంజ్ లో నిందితులు ఏటీఎం వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని బెదిరించి రూ.7 కోట్లు ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ జరగ్గా పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగి నిందితుల కోసం గాలించి ప్రారంభించారు.

బెంగుళూరులో ATM వాహనంలో రూ.7 కోట్లు చోరీ.. నిందితుల్లో మాజీ సైనికుల కుమారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 19న బెంగుళూరులో ఏటీఎం చోరీకి గురైంది. సినిమా రేంజ్ లో నిందితులు ఏటీఎం వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని బెదిరించి రూ.7 కోట్లు ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ జరగ్గా పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగి నిందితుల కోసం గాలించి ప్రారంభించారు. కాగా కేసు విచారణలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుల్లో ఏపీకి చెందిన కుప్పం వాసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

గుడిపాల మండలం చిత్తపారకు చెందిన సోదరులు రవి, రాకేష్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దోపిడీ తరవాత యూపీ రిజిస్ట్రేషన్ వాహనంలో నగదును తీసుకువచ్చి అట్టపెట్టలను అటవీ ప్రాంతంలో పారేసినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా కూర్మానిపల్లిలోని నవీన్ అనే వ్యక్తి ఇంట్లో నిందితులు నగదు దాచినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నవీన్ ఇంట్లోని రూ.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం కేసుపై విచారణ కొనసాగుతోంది.

Next Story