మెరుపు వేగంతో వచ్చి.. మాయం అయిపోయాడు: సినిమా స్టైల్‌లో రూ.5.50 లక్షల దోపిడీ

by Gantepaka Srikanth |

గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ వ్యాపార కేంద్రం 'మానెక్ చౌక్'లో పట్టపగలే ఒక సంచలన దొంగతనం చోటుచేసుకుంది.

మెరుపు వేగంతో వచ్చి.. మాయం అయిపోయాడు: సినిమా స్టైల్‌లో రూ.5.50 లక్షల దోపిడీ
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ వ్యాపార కేంద్రం 'మానెక్ చౌక్'లో పట్టపగలే ఒక సంచలన దొంగతనం చోటుచేసుకుంది. ఒక బులియన్ (బంగారు, వెండి) వ్యాపారి వద్ద పనిచేసే ఉద్యోగి అప్రమత్తత లోపాన్ని ఆసరాగా చేసుకుని, ఒక దొంగ కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే రూ.5.50 లక్షల నగదును లాక్కొని పారిపోయాడు. సినిమా సీన్‌ను తలపించేలా సాగిన ఈ దోపిడీ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

అప్రమత్తంగా లేని సమయం చూసి..

పోలీసులు, స్థానిక వర్గాల కథనం ప్రకారం.. సదరు బులియన్ వ్యాపారి ఉద్యోగి భారీ మొత్తంలో నగదు ఉన్న బ్యాగ్ రోడ్డుపై నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను చాలా సేపటి నుండి ఫోన్ మాట్లాడుతూ, తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించకుండా పూర్తిగా ఫోన్ కాల్లోనే నిమగ్నమైపోయాడు. సరిగ్గా అదే సమయంలో అతనిపై కన్నేసిన ఒక దొంగ.. చుట్టుపక్కల జనం రద్దీగా ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ముందుకు వచ్చాడు. ఉద్యోగి ఫోన్ సంభాషణలో మునిగిపోయి. అప్రమత్తంగా లేని క్షణాన్ని చూసి, మెరుపు వేగంతో అతని చేతిలో ఉన్న రూ. 5.50 లక్షల నగదు బ్యాగులోంచి డబ్బును చాలా ఈజీగా చోరీ చేశాడు. క్షణాల వ్యవధిలోనే అక్కడి నుండి మాయం అయిపోయాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

బాధితుడు తేరుకుని గట్టిగా కేకలు వేసేలోపే దొంగ అచూకీ లేకుండా పోయాడు. ఈ మొత్తం వ్యవహారం అక్కడ అమర్చిన ఒక దుకాణం సీసీటీవీ కెమెరాలో రికార్డెంది. ప్రస్తుతం ఈ దొంగతనం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) విపరీతంగా వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాల్లో, అది కూడా పగటిపూట ఇంత ధైర్యంగా దోపిడీకి పాల్పడటం స్థానిక వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు సీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపారులు, వారి సిబ్బంది పెద్ద మొత్తంలో నగదుతో ప్రయాణించేటప్పుడు లేదా రోడ్లపై ఉండేటప్పుడు ఫోన్లలో మునిగిపోకుండా, పరిసరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.

Next Story