- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక ఫోన్ కాల్‌తో రూ. 18 లక్షల 50 వేలు మాయం
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుండి డబ్బులను మాయం చేస్తున్నారు.

దిశ,చిన్నచింతకుంట: రోజురోజుకు సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుండి డబ్బులను మాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఒకరి ఖాతా నుంచి దాదాపు రూ .18,50,000 మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్ల నుంచి ,గత నెల 19న గుర్తు తెలియని ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు మిస్ యూస్ అయిందని, మీ ఖాతాలో డబ్బులు ఉండేవిధంగా చూసుకోవాలంటూ ఫోన్స్ కాల్స్ రావడం తో పాటు వారు అతన్ని నమ్మించేందుకు బలవంతం చేశారు. అతని వెంటనే సమీపంలోని బ్యాంకు వద్దకు వెళ్లి వెంటనే విడతలవారీగా దాదాపు రూ. 18,50,000 వరకు అర్ టీ జీ ఎస్ రూపంలో అపరిచిత ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని రోజులు గడిచింది. తాను సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయానని గ్రహించి చిన్నచింతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు .కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్ లాల్ నాయక్ తెలిపారు.
- Tags
- Cybercrime






