VIDEO: జనగామ జిల్లాల్లో అఘోరాల గెటప్‌లో దొంగబాబాలు.. పౌడర్ చల్లితే అంతే!

by Ajay Maddhiboyina |

జ‌న‌గామ జిల్లాలో దొంగ‌బాబాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. కొంత‌మంది కాషాయ దుస్తులు ధ‌రించి ముఖాల‌కు విభూది రాసుకుని స్టేష‌న్ ఘ‌న్పూర్ లో సంచరిస్తున్నారు. చూడ్డానికి అఘోర గెట‌ప్ లో ఉన్న బాబాలు దుకాణాల వ‌ద్ద‌కు వెళ్లి వ్యాపారులతో మాట్లాడుతున్నారు.

VIDEO: జనగామ జిల్లాల్లో అఘోరాల గెటప్‌లో దొంగబాబాలు.. పౌడర్ చల్లితే అంతే!
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌న‌గామ జిల్లాలో దొంగ‌బాబాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. కొంత‌మంది కాషాయ దుస్తులు ధ‌రించి ముఖాల‌కు విభూది రాసుకుని స్టేష‌న్ ఘ‌న్పూర్ లో సంచరిస్తున్నారు. చూడ్డానికి అఘోర గెట‌ప్ లో ఉన్న బాబాలు దుకాణాల వ‌ద్ద‌కు వెళ్లి వ్యాపారులతో మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలో పూజలు, తాయ‌త్తుల‌ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి ముఖాల‌పై ఒక‌ర‌క‌మైన పౌడ‌ర్ చ‌ల్లుతున్నారు. అలా ఓ వ్యాపారిపై పౌడ‌ర్ పై చ‌ల్లి కారులో పారిపోతుండ‌గా స్థానికులు ప‌ట్టుకున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో దొంగ‌బాబాల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. ఉద‌యం పూట దొంగ‌బాబాలు వ‌చ్చి దుకాణాల వ‌ద్ద 10 రూపాయ‌లు, 20 రూపాయ‌లు అడుగుతున్నారని చెప్పారు. త‌ర‌వాత మాయ మాట‌లు చెప్పి రూ.500 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు. ఒక‌ర‌క‌మైన పౌడ‌ర్ చ‌ల్లుతున్నార‌ని చెప్పారు. వీడియో

Next Story