హైవేపై ఒకే కారును ఢీకొట్టిన పలు వాహనాలు, నలుగురు దుర్మరణం

by Malleboina Mahesh |

జాతీయ రహదారిపై ఒకే కారును అనేక వాహనాలు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాలతో మృతి చెందారు.

హైవేపై ఒకే కారును ఢీకొట్టిన పలు వాహనాలు, నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రహదారిపై ఒకే కారును అనేక వాహనాలు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ విషాద సంఘటన కృష్ణగిరి జిల్లాలో బెరండపల్లి సమీపంలో జరిగింది. మృతులను ఈరోడ్‌కు చెందిన టెక్నీషియన్ టి మదన్ అలియాస్ మదన్ కుమార్ (28), సేలంలోని కన్నకురిచ్చికి చెందిన కె గోకుల్ (28), సేలంలోని పచ్చగుండనూర్‌కు చెందిన ఎం ముకిలన్ (30), సేలంలోని పన్నపట్టికి చెందిన పి మణివన్నన్ (27)గా గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, "ఐదు నెలల క్రితం వివాహం చేసుకుని కెనడాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న మదన్ కుమార్ దీపావళి పండుగ కోసం ఇంటికి తిరిగి వస్తున్నాడు.

ఈ క్రమంలో అతని ముగ్గురు స్నేహితులు అతన్ని తీసుకెళ్లడానికి బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా బెరండపల్లి సమీపంలో గుర్తు తెలియని కంటైనర్ వాహనం సడన్ బ్రేకులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది." "దీని వల్ల అనేక వాహనాలు, ఒక కంటైనర్ లారీ, ఒక కారు ప్రమాదం జరిగింది." అయితే వెనకాలే వస్తున్న అనేక వాహనాలు కంట్రోల్ కాకపోవడంతో మృతులు ఉన్న కారును ఢీకొట్టాయి. వారి కారు మధ్యలో ఇరుక్కుపోయింది. వెనుక నుండి వస్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఏది ఏమైనప్పటికి విదేశాల నుంచి తిరిగి వస్తున్న స్నేహితుడి కోసం వెళ్లి వారి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story