Road Accident: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం.. నగరానికి చెందిన ఏడుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-11 06:54:04  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం పాలైన విషాదం ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని జబల్‌పూర్ (Jabalpur) జిల్లా పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Road Accident: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం.. నగరానికి చెందిన ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం పాలైన విషాదం ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని జబల్‌పూర్ (Jabalpur) జిల్లా పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Andhra Pradesh) లోని నాచారం నుంచి కొంతమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో బజల్‌పూర్ జిల్లా కేంద్రానికి 65 కి.మీ. దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు (Truck) బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా (Jabalpur Collector Deepak Kumar Saxena) వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జబల్‌పూర్‌ ఎస్పీ (Jabalpur SP) ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గురైన బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీకి చెందిన వారు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులంతా హైదరాబాద్ నగరంలోని నాచారం వాసులుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతుల పేర్ల వివరాలను ఇంత వరకు వెల్లడించ లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story