- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
by Bhanu |
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కషి నగర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి

X
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కషి నగర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఇరువురు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ఒక యువకుడు, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సందీప్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు,ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు తెలిపారు.ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






