- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..13మందికి గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు దగ్గర ఆగిఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు దగ్గర ఆగిఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరణించినవారిలో రాంబాబు(50), నారాయణరావు(50), మోహన్‌నాయుడు(8) ఉన్నారు. 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని వియజనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది వాహనంలో ఉన్నారు.
వీరంతా ఒడిశాలోని రాయగడలోని మజ్జి గౌరమ్మ ఆలయానికి దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేట వాసులుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మృతుల గ్రామం బొత్సపేటలో తీవ్ర విషాదం నిండుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడం, 13 మంది గాయాలపాలు అవ్వడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.






