- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణీతోసహా కుటుంబం మొత్తం స్పాట్ డెడ్..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మంసూఖ్‌పుర పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. షాప్రి నగర్ ట్రై జంక్షన్‌లో మట్టి లోడ్‌తో వెళ్తున్న ట్రక్స్ ఢీకొని కుటుంబం మొత్తం స్పాట్ డెడ్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మంసూఖ్‌పుర పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. షాప్రి నగర్ ట్రై జంక్షన్‌లో మట్టి లోడ్‌తో వెళ్తున్న ట్రక్స్ ఢీకొని కుటుంబం మొత్తం స్పాట్ డెడ్ అయ్యారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్.. బైక్‌ను ఢీకొనడంతో భార్యాభర్తలు, కుమార్తె ట్రక్కు కింద పడి నుజ్జనుజ్జు అయ్యారు. ట్రక్ బైక్‌ను దాదాపు 600 మీటర్లు లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాగా మృతులు రేహా గ్రామపంచాయితీలోని కయేది గ్రామానికి చెందిన రామ్ సేవక్(40), అతని భార్య అనితా దేవి(35), కుమార్తె డాలీ(10) అని గుర్తించారు పోలీసులు. కాగా అనిత నాలుగు నెలల గర్భవతి కూడా. కేసు నమోదు చేసిన పోలీసులు.. పారిపోయిన డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నామని.. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Next Story






