- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి
ఉగాండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. ఉగాండా రాజధాని కంపాలాలోని గులు హైవేపై ఓ బస్ డ్రైవర్ లారీని ఓవర్ టెక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీ కొట్టాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. ఉగాండా రాజధాని కంపాలాలోని గులు హైవేపై ఓ బస్ డ్రైవర్ లారీని ఓవర్ టెక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీ కొట్టాడు. బస్సును వెంటనే మరోవైపుకు తిప్పగా పక్కనే వస్తున్న రెండు కార్లను సైతం ఢీ కొట్టాడు.
దీంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ క్రమంలో బస్సుల్లో, కార్లలో ప్రయాణిస్తున్న 63 మంది మరణించగా కొంతమందికి తీవ్రగాయాలు, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను అక్కడ నుండి తరలించారు. క్షతగాతృలను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటన దేశంలో అతి పెద్ద రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
Next Story






