నర్సాపూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని 9 ఏళ్ల బాలిక మృతి

by Taduka Kalyani |   (  Updated:2025-06-07 15:18:41  IST  )

కారు ఢీకొని 9 ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని తూప్రాన్ రూట్ లో చోటుచేసుకుంది

నర్సాపూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని 9 ఏళ్ల బాలిక మృతి
X

దిశ, నర్సాపూర్ : కారు ఢీకొని 9 ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని తూప్రాన్ రూట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణానికి చెందిన అర్జున్ లలితల కూతురు తుప్రాన్ ప్రధాన రహదారి పక్కన నడుస్తున్న క్రమంలో తూప్రాన్ వైపు నుంచి వస్తున్న కారు బాలికను ఢీకొట్టింది. దీంతో సిందే అర్చన( 9) అక్కడిక్కడే మృతి చెందింది. విజయం కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని అర్చనను చూసి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కాగా అర్చనకు ఒక అక్క తో పాటు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు.

Next Story