- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
by Mallepaka Hamsa |
నల్లగొండ బైపాస్ రోడ్డు లో గుంటూరు నుంచి హైదరాబాద్ అతివేగంగా వెళ్తున్న ఎస్క్రోస్ కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది.

X
దిశ,నల్లగొండ: నల్లగొండ బైపాస్ రోడ్డు లో గుంటూరు నుంచి హైదరాబాద్ అతివేగంగా వెళ్తున్న ఎస్క్రోస్ కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వెళ్తున్న జైలో వాహనం మీద పడటంతో అందులో ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి. అలాగే రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని నల్లగొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక కారులో వారు ఇద్దరు దంపతులు గుంటూరు వాసులుగా మరికొందరు మిర్యాలగూడ వాసులుగా గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story






