- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాల ఢీ
జపాన్ లో ఘోర్ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గడ్డకట్టుకుపోయిన మంచు కారణంగా 50వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. గున్మా ప్రిఫెక్చర్ లోని మినాకామి పట్టణం సమీపంలో కన్

దిశ, వెబ్ డెస్క్: జపాన్ లో ఘోర్ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గడ్డకట్టుకుపోయిన మంచు కారణంగా 50వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. గున్మా ప్రిఫెక్చర్ లోని మినాకామి పట్టణం సమీపంలో కన్ ఎత్తు ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మరణించగా 26మందికి గాయాలు అయ్యాయి. వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో కొన్ని వాహనాలకు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్దమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసి ఇతర వాహనాలకు వ్యాపించకుండా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట శుక్రవారం రాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. అనంతరం మంచుకారణంగా బ్రేకులు పడకపోవడంతో వెనకాల వచ్చిన వాహనాలు సైతం ఒకదానికొకటి ఢీ కొట్టాయి. దీంతో 50కి పైగా వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.






