- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన నల్లగొండ జిల్లా పరిధిలోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన నల్లగొండ జిల్లా పరిధిలోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad)లోని అల్వాల్ (Alwal) ప్రాంతానికి చెందిన సాయిగౌడ్ (Sai Goud), ప్రవీణ్ (Praveen)లు మరో ముగ్గురు కలిసి కారులో విజయవాడ (Vijayawada)కు బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు నల్లగొండ (Nalgonda) జిల్లా పరిధిలోని ఏపీ లింగోటం (AP Lingotam) వద్దకు రాగానే ఎదురుగా ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో సాయిగౌడ్, ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా జాతీయ రహదారి (National Highway)పై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






