Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే తండ్రీ, కొడుకు దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో తండ్రీ, కొడుకు దుర్మరణం పాలైన విషాద ఘటన పెద్దపల్లి (Peddapally) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే తండ్రీ, కొడుకు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో తండ్రీ, కొడుకు దుర్మరణం పాలైన విషాద ఘటన పెద్దపల్లి (Peddapally) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరి‌ఖని (Godavarikhani) పట్టణానికి చెందిన సతీశ్ (Sathish), సాత్విక్ (Satwik) మరో ఇద్దరు కలిసి కారులో హైదరాబాద్ (Hyderabad) నుంచి గోదావరిఖని (Godavarikhani)కి బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు పట్టణ శివారులోని గాంధీనగర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా ఉన్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దర్ఘటనలో సతీష్ (Sathish), అతడి కుమారుడు 11 నెలల సాత్విక్ (Satwik) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్‌కు చేరుకుని గాయపడిన వారిన చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story