Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-03 02:06:58  IST  )

అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలో కొట్టాయం (Kottayam)లో చోటుచేసుకుంది.

Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలోని కొట్టాయం (Kottayam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ (Hyderabad)లోని ఉప్పర్‌గూడ (Upparguda) ప్రాంతానికి చెందిన కొంతమంది అయ్యప్ప స్వాములు బస్సులో శబరిమల దర్శనానికి బయలుదేరారు. అయితే, బస్సు కొట్టాయం (Kottyam) ఘాట్ వద్దకు రాగానే మూలమలుపులో అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో డ్రైవర్ రాజు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యడు. బస్సులో ఉన్న 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు.

Next Story